ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ జనవరి 9న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డప్పటికీ ఎట్టకేలకు జనవరి 9న సినిమాని విడుదల చేయడానికి అన్ని రకాల పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80% పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్గా ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు డైరెక్టర్ పై హీరో పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే ట్రైలర్ చూసిన జనాలు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మకంగా ఉన్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక పోస్ట్ చూస్తే మాత్రం ప్రభాస్ అభిమానుల్లో భయం పట్టుకుంది.

ఎందుకంటే ప్రభాస్ నటించిన సినిమాల సెంటిమెంట్ ప్రకారం అదే సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం ప్రభాస్ రాజా సాబ్ మూవీ కూడా డిజాస్టర్ అని పోస్టులు పెడుతున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటి అనేది చూస్తే..ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఆర్ అనే అక్షరం మొదట ఉంటే కచ్చితంగా సినిమా డిజాస్టర్ అవుతుంది.అలా ప్రభాస్ నటించిన రెబల్, రాధే శ్యామ్,రాఘవేంద్ర ఈ మూడు సినిమాల్లో ఇంగ్లీష్ లో మొదటి లెటర్ ఆర్ తోనే స్టార్ట్ అవుతుంది. అలా ఆర్ లెటర్ తో స్టార్ట్ అయిన ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. రాఘవేంద్ర,రెబల్ సినిమాలు పక్కన పెడితే ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాక వచ్చిన రాధే శ్యామ్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది.

దీంతో ప్రభాస్ నటించిన సినిమాల విషయంలో ఆర్ అనే లెటర్ తో సినిమా టైటిల్ స్టార్ట్ అయితే కచ్చితంగా అది డిజాస్టర్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది అనే టాక్ వినిపిస్తున్న వేళ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ కూడా డిజాస్టర్ అంటూ చాలామంది ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది.అదే సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం ప్రభాస్ ఖాతాలో మరో డిజాస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. కానీ మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది.ఎందుకంటే అదే సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ప్రభాస్ నుండి వస్తున్న రాజాసాబ్ మూవీ ఆర్ లెటర్ తో కాదు టి లెటర్ తో స్టార్ట్ అవుతుంది.. ఎందుకంటే ఉత్తి రాజా సాబ్ కాదు సినిమా అసలు పేరు ది రాజా సాబ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: