
నామినేషన్ల విత్డ్రాకు నవంబర్ 24వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు. దీంతో అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ప్రత్యేకించి మరి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ,తమ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను ప్రకటించారు. ఈరోజో ,రేపో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా విషయం కూడా తేలబోతోంది. అలాగే బిజెపి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు సన్నహాలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో టిడిపి పార్టీ పేరు తెరపైకి వినిపిస్తోంది. ఈరోజు తెలంగాణకు చెందిన టిడిపి నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పైన చర్చించబోతున్నారు. దీంతో ఇప్పుడు టిడిపి తమ అభ్యర్థిని బరిలోకి దింపుతారా? లేకపోతే ఏదైనా పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గోపినాథ్ మృతి చెందడంతో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. గోపీనాథ్ టిడిపి పార్టీలో గెలిచి ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో ఇప్పుడు మరొకసారి అదే ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడంతో, బిఆర్ఎస్ పార్టీకి టిడిపి మద్దతు ప్రకటిస్తారా? లేదా అనే చర్చ తెలంగాణ రాజకీయాలలో కొనసాగుతోంది. అలాగే మరొకవైపు బిజెపి అభ్యర్థి నిలబెట్టడానికి కసరత్తులు చేస్తున్న సమయంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు బిజెపికి మద్దతిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై టిడిపి పార్టీ ఎటువైపు అనేది ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.