
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 1990 కాలంలో తనకు ఎక్కువగా అవకాశాలు రావడం తన అదృష్టమని ప్రేక్షకులు భావించేవారు, కానీ బలమైన స్క్రిప్టులు, ప్రధాన పాత్రలు రాలేదని బాధ తనకు ఉండేదని తెలియజేశారు. అలాగే జీవిత భాగస్వామితో , స్నేహితులతో కలిసి పని చేయడం వృత్తిపరంగా సులభమే అయినప్పటికీ. అది ఎల్లప్పుడూ సరైనది కాదు అంటు తెలియజేశారు సైఫ్ అలీ ఖాన్. వృత్తిపరంగా ఎదుగుదలకు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యక్తిగత బంధాలను ఎక్కువగా కలుపుకోకూడదనే విధంగా తెలియజేశారు. వ్యక్తిగత బంధాలను ఇలా కలుపుకోవడం వల్ల కొత్త సవాళ్లను ఎదుర్కోవడం తగ్గిపోతుందనే తన అభిప్రాయం అన్నట్టుగా తెలియజేశారు సైఫ్ అలీ ఖాన్.
తన భార్య అయిన కరీనాకపూర్ తో కూడా ఓంకార, ఎల్ఓసి కార్గిల్, ఏజెంట్ వినోద్ తదితర చిత్రాల నటించారు. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. హైవాన్, జిస్మ్ -3 వంటి చిత్రాలలో నటించబోతున్నారు సైఫ్. మరి తెలుగులో నటించిన దేవర - 2 వ భాగం షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ విషయంపై ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. మొత్తానికి తన భార్యతో కలిసి నటించడం పైన సైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.