ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య. “మీ కుటుంబసభ్యులు మాత్రమే గెలిచారు... ఆ కిటుకేంటో అందరికీ చెప్పి ఉండవచ్చు కదా?” అని ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఉద్దేశించి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సాధారణంగా జగన్ రెడ్డి ఎప్పుడూ జోకులు వేయరు, ఆయన మాట్లాడిన ప్రతి మాటకు అర్థం ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్య వెనుక ఉన్న భావం ఇప్పుడు రాజకీయవర్గాల్లోచర్చనీయాంశమైంది.జగన్‌కి పెద్దిరెడ్డి కుటుంబంపై అనుమానాలు మొదలయ్యాయంటున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ బలహీనంగా పడిపోవడం, పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే గెలవడం ఆయనకు ప్రశ్నగా మారింది.


తంబళ్లపల్లె నియోజకవర్గంలో జయచంద్రరెడ్డి అనే వ్యక్తి టీడీపీలో చేరి పోటీ చేశాడు. కానీ అతని ఓటమి తర్వాత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎందుకంటే ఆ సీటు గెలిచే స్థితిలో ఉండి ఓడిపోయాడు. ఈ సంఘటన పెద్దిరెడ్డి సోదరుడి ప్రయోజనానికి అనుకూలంగా జరిగిందని ఇప్పుడు పార్టీ లోపలే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు జగన్‌ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇక పెద్దిరెడ్డి రాజకీయంగా కూడా క్రమంగా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట ఆయనను నియమించినా, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి పెద్దగా బయట కనిపించడం లేదు.


ఆయనపై ఉన్న పలు కేసుల్లో విచారణలు కూడా నెమ్మదించాయి. దీనిపై టీడీపీలోనూ వైసీపీ లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి అరెస్ట్‌ అయినా, జగన్ స్పందించకపోవడం కూడా రాజకీయంగా అనేక సందేహాలకు తావిస్తోంది. తాజాగా మిథున్ రెడ్డి అమెరికాకు వెళ్లబోతున్నాడన్న వార్తలతో జగన్ అనుమానాలు మరింత పెరిగినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు అన్నీ కలిపి జగన్ మనసులో పెద్దిరెడ్డి కుటుంబంపై అపనమ్మకానికి కార‌ణ‌మ‌య్యాయా ? అన్న సందేహాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయినా, పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం గెలవడం జగన్‌కు అర్ధం కావడం లేదు. అందుకే ఆ కుటుంబం పార్టీ నుంచి క్రమంగా దూరం కావడం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: