దాంపత్య బంధాలు పెళ్లయిన కొద్ది రోజులకే కొన్ని విభేదాల కారణంగా, చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా దాంపత్య జీవితాన్ని ముగిస్తుంటారు.. ఇటివల కాలంలో విడాకులు సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో జపాన్ జంటలు మాత్రం తమ మధ్య కమిట్మెంట్ ను పెంచుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తున్నట్లు అక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి వల్ల అక్కడ దంపతుల మధ్య అనుబంధాన్ని నిలబెడుతున్నాయని తెలుపుతున్నారు మరి ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1). అనవసరపు విషయాలకు దూరం:
ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత దగ్గరవుతారనుకుంటాం.. చాలా మంది తమ భాగస్వామితో ప్రతి విషయంలో కూడా పారదర్శకంగానే వ్యవహరిస్తుంటారు. కానీ వీటన్నిటికి భిన్నమైన సాంప్రదాయాలను జపనీయులు పాటిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అతిగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య అనవసరపు విషయాలకు దారితీస్తుందని , అలాంటి వాటికి దూరం పెడుతున్నారు. కేవలం తమ భాగస్వామితో సున్నితమైన, గొడవలకు దారి తీయని అంశాల గురించి మాట్లాడతారట. ఈ పద్ధతిని "Aimai " గా పిలుస్తారు ఇది దంపతుల మధ్య శాంతిని సానుకూలంగా ఉండేలా చేస్తుంది.



2). ఒకరికొకరు తోడుగా ఉండడం:
వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒకరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. భార్య, భర్తల నడుమ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే ఓపిక సహనంతో  వ్యవహరిస్తూ,జపాన్ జంటలు సుఖాలలో తోడు  ఉండడం ,కష్టాలలో దూరంగా ఉండడం వంటివి కాకుండా, ఎలాంటి పరిస్థితి వచ్చి కూడా దంపతులు ఇద్దరు ఒకరికొకరు తోడుగానే నిలుస్తారు. ఇదే అక్కడ వారి భాగస్వామికి బలంగా మారుతుంది. ఈ పద్ధతిని జపాన్ లో GAMAN పిలుస్తారు.


3). ఐలవ్యూ చెప్పడం

బయట వారు ఎలాంటి చిన్న సహాయం చేసినప్పుడు థాంక్యూ అని చెబుతూ ఉంటాం. అది ఇంట్లో వాళ్ళు లేదా భాగ స్వామి చేస్తే మనవాళ్లే కదా అని తేలికగా తీసుకుంటారు కొందరు.. కానీ జపనీయులు భోజనం చేసే ముందు వాళ్ళు తినే పదార్థానికి సైతం నమస్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా దాని పండించిన రైతుకు కృతజ్ఞతలు తెలిపే అలవాటు ఉంది. LTADAKIMASU అని పిలుస్తారు. జపనీస్ జంటలు భాగస్వామి  చేసిన సహాయానికి థాంక్యూ చెప్పడం , వారి విజయాలను సెలబ్రేషన్స్ చేసుకోవడం , అలాగే భాగస్వామికి తరచూ ఐలవ్యూ చెప్పడం వంటి వల్ల అక్కడ వారి మనసులో ప్రేమను తెలియజేస్తూ మరింత దగ్గర అయ్యేలా చేస్తుంది.


ప్రతి విషయంలో కూడా విరామం తీసుకుని తమ ఇష్టా ఇష్టాల అభిరుచులపైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఉంటారు జపనీయులు.. దీనికి MA అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.

ఏ జంట కైనా సరే స్వార్థం, ఆదిపత్యం, అహంకారం అనేది జంట మధ్య చిచ్చు పెడతాయి.. అలాంటి వాటికి దూరం పెడుతుంటారు. వాటినే జపనీయులు WA అనే సూత్రాన్ని పాటిస్తారు. ఎటువంటి పరిస్థితి ఎదురైన భాగస్వామితో రాజీ కుదిర్చుకునేందుకే చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: