
నయనతార పెళ్లి డాక్యుమెంటరీలో మరొక కేసు కూడా ఉంది. చంద్రముఖి సినిమాలో నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. తమ అనుమతి లేకుండా సినిమాలోని సన్నివేశాలను వాడుకున్నందుకు నష్టపరిహారం డిమాండ్ చేశారు.
పెళ్లి సమయంలో నయనతార, విఘ్నేష్ శ్రీవారికి దర్శించుకోవడానికి జంటగా వెళ్లారు. అయితే అక్కడ గుడి దగ్గర చెప్పులతో ఫోటోలు తీసుకోవడంతో ttd దేవస్థానం వారు నోటీసులు పంపించారు. ఆ విషయంపై ఈ జంట క్షమాపణలు కూడా చెబుతూ ఒక లేఖనే పంపించారు.
వివాహమనంతరం పిల్లలను సరోగసి ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడంతో వారు సరోగసి చట్టాన్ని ఉల్లంగించారనే ఆరోపణలు వినిపించాయి. ఈ విషయం తమిళనాడు ఆరోగ్య శాఖ విచారణ చేపట్టి క్లారిటీ ఇచ్చారు..
గతంలో ఒక విషయంలో అల్లు అర్జున్ ను అవమానపరిచిందనే విధంగా వినిపించాయి. 2016 లో ఒక అవార్డు వేడుకలలో నయనతార, అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డును అందుకోవాల్సి ఉండగా సరిగ్గా అదే సమయానికి నయనతార అవార్డు తీసుకోకుండా తన ప్రియుడు విఘ్నేష్ తో అవార్డును తీసుకోవాలనుకుంటున్నాను అంటూ కోరింది. ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికీ నయనతార పైన ఫైర్ అవుతూ ఉంటారు.
నయనతార కి హీరోలతోనే కాదు హీరోయిన్ తో కూడా గొడవ.. ప్రముఖ హీరోయిన్ త్రిషతో ఎన్నో ఏళ్ల నుంచి మనస్పర్ధలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమా విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట.
నయనతార సీతగా నటించడం పై కూడా చాలానే విమర్శలు వినిపించాయి.. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలో ఈమె సీతగా నటించింది. ఈ విషయంపై కొన్ని హిందూ సంఘాలు నిరసనను కూడా తెలియజేశారు.
అంతేకాకుండా అన్నపూర్ణి అనే చిత్రంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి మాంసం తినే అమ్మాయి పాత్రలో కనిపించడంతో చాలామంది హిందువులు నయనతార పైన ఆగ్రహాన్ని తెలిపారు. ఈ విషయంపై ఎన్నో కేసులు కూడా ఎదుర్కొంది.
అలాగే ప్రముఖ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం, మరొక హీరో శింబుతో ప్రేమ వ్యవహారం వంటి వాటిలో కూడా నాయనతార ఎన్నో వివాదాలలో చిక్కుకుంది.