ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌లో ఒకే ఒక హాట్ టాపిక్ చర్చ జరుగుతోంది . అదే రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండ నిశ్చితార్థం విషయం. సోషల్ మీడియా మొత్తం ఈ జంట గురించి పోస్టులతో నిండిపోయింది. స్టార్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే ఈ జంటపై అభిమానులు చూపుతున్న ఆసక్తి చూస్తుంటే, వీరి బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, దసరా సందర్భంగా విజయ్ దేవరకొండ నివాసంలో, ఇరువురు తల్లిదండ్రుల సమక్షంలో విజయ్–రష్మిక నిశ్చితార్థం జరిగిందట. ఈ వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులలో ఉత్సాహం అలరారుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఇద్దరి నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
 

ఒక ఫోటో కూడా బయటకు లీక్ కాలేదు. కానీ అభిమానులు మాత్రం నిశ్చితార్థం నిజమని నమ్మకంగా చెబుతున్నారు. ఆ నమ్మకానికి కారణం కూడా ఉంది.  ఇటీవల ఒక మీట్ లో విజయ్ దేవరకొండ చేతిలో కొత్త బంగారు ఉంగరం కనిపించడం. అదే రింగ్ చూసి నెటిజన్లు "ఇదే నిశ్చితార్థ రింగ్ కావచ్చు!" అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలుపెట్టారు.ఇక టాలీవుడ్‌లో ఈ న్యూస్ ఒక్కసారిగా సునామీలా వైరల్ అయింది. అభిమానులు మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.



ఈ వార్త బయటకు రావడంతో జనాలు గతంలో ఇలాంటి విధంగానే తమ ప్రేమాయణాన్ని దాచిపెట్టి, చివరికి పెళ్లితో అందరిని సర్ప్రైజ్ చేసిన మరో జంటను గుర్తు చేసుకుంటున్నారు — వారు మరెవరో కాదు, క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ. వీళ్లిద్దరూ కూడా తమ రిలేషన్‌షిప్ గురించి ఎన్నిసార్లు మీడియా ప్రశ్నించినప్పటికీ "మేము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే" అని చెబుతూ, చాలా ప్రైవేట్‌గా బంధాన్ని కొనసాగించారు. కానీ ఒక్కరోజు "మేము పెళ్లి చేసుకుంటున్నాం" అంటూ బయటకు వచ్చి మొత్తం దేశాన్ని షాక్‌కు గురి చేశారు. ఆ టైంలో వారి పెళ్లి వార్త ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.



ఇప్పుడు అదే విధంగా రష్మిక మరియు విజయ్ దేవరకొండ కూడా తమ బంధాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారనే అభిప్రాయం ఉంది. కెరీర్‌పై దృష్టి పెట్టడంతో పాటు, తమ పర్సనల్ లైఫ్‌కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగుతున్న ఈ జంట, కుటుంబ సభ్యుల అంగీకారంతో తమ నిశ్చితార్థాన్ని పూర్తిచేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇక అభిమానులు మాత్రం వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అనే ఆసక్తిలో ఉన్నారు. విరాట్–అనుష్క లా సడెన్‌గా ఒకరోజు పెళ్లి వార్తతో రష్మిక–విజయ్ కూడా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారేమో అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.ఏది ఏమైనా, విజయ్ దేవరకొండ–రష్మిక మందన జంట టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రేమకథ నిజమా? నిశ్చితార్థం జరిగిందా? లేక ఇది కేవలం గాసిప్పా? అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ అప్పటి వరకు సోషల్ మీడియా అంతా “విజయ్–రష్మిక” ట్యాగ్‌లతో హీట్‌గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: