
తాజాగా ఈ కాంబినేషన్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా మళ్లీ రీ-వర్క్ దశలో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్‌ను పూర్తిచేసి, రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తర్వాతి షెడ్యూల్ కోసం కొన్ని డేట్స్ కేటాయించబోతున్నారట. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో పవన్ కనిపిస్తే విజువల్ ఫీస్ట్ తప్పకపోదని అభిమానులు భావిస్తున్నారు. “సైరా నరసింహ రెడ్డి”, “ధృవ, కిక్” వంటి స్టైలిష్ సినిమాలతో సురేందర్ రెడ్డి తన ప్రత్యేకతను చూపించిన సంగతి తెలిసిందే.
ఆయన టచ్‌లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఎలాంటి లుక్, ఎలాంటి మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయో అనే కుతూహలం పెరుగుతోంది. ఇక “ఓజీ” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్‌తో ప్రేక్షకులను అలరించనున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత సురేందర్ రెడ్డితో కలిసి ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తే అది మరో పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు