సినీ ఫీల్డ్ అంటేనే రకరకాల పాత్రలు రకరకాల వేషధారణలు ఉంటాయి. సినీ ఫీల్డ్ వాళ్లని స్ఫూర్తిగా చేసుకుని చాలామంది ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ స్టార్స్ దేశంలోనే సినిమా ఇండస్ట్రీలలో చాలా స్పీడ్ గా ఉంటారు. అలాంటి బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ లలో దీపికా పదుకొనే ఒకరు. అయితే ఈమె సినిమాల్లో ఏవిధంగా గుర్తింపు తెచ్చుకుంటుందో వివాదాల్లో కూడా ఆ విధంగానే చిక్కుకుంటూ ఉంటుంది.  తాజాగా ఆమె తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి అబుదాబి టూరిజం ప్రమోషన్ యాడ్లో  కనిపించింది. ఇందులో ఆమె హిజాబ్ ను పోలిన అబాయా ధరించి కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 

ఈ వీడియోలో ఆమె సాంప్రదాయ ముస్లిం మహిళలు ధరించే దుస్తులు ధరించి మసీద్ తదితర ప్రాంతాల్లో కనిపించడంతో కొంతమంది నెటిజన్లు మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతీసే ప్రయత్నం అంటూ పేర్కొన్నారు. డబ్బుల కోసం ఎలాంటి మతాలవారినైనా ప్రమోషన్ చేయిస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు.. ఇదే విషయంపై మరికొంతమంది నెటిజన్స్ స్పందిస్తున్నారు.. ఇందులో దీపిక ధరించింది హిజాబ్ కాదని అబాయా అని చెప్పుకొచ్చారు. ఈ దుస్తులను మధ్య ప్రాచ్య దేశాల్లో సాంస్కృతికంగా వేసుకుంటారని, ఏ మతానికి చెందిన మహిళ అయినా మసీదుల్లో ప్రవేశించే సమయంలో దైవ సూచకంగా ఇవి ధరిస్తారని తెలియజేశారు.

 ఇవి వేసుకోవడం  మత ప్రచారం అని భావించడం తప్పని, ఆమె అక్కడి సంస్కృతికి గౌరవం చూపింది తప్ప ఏ మతాన్ని కించపరిచే విధంగా చేయలేదని తెలియజేస్తున్నారు. ఇక సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇటువంటి యాడ్స్ చేయడం అనేది అంతర్జాతీయ టూరిజం ప్రమోషన్స్ లో భాగమని, నటీనటులు ఎవరైనా సరే స్థానిక సాంప్రదాయాలను పాటిస్తూ దుస్తులు ధరించడం సర్వసాధారణమని తెలియజేశారు. నిజానికి నటినటులు అంటేనే ఫ్యాషన్ రంగాన్ని అభివృద్ధి పరుస్తారని, వారు ఏ మతాన్ని కించపరిచే విధంగా నటించరని తెలియజేశారు. దీపిక వేసుకున్న డ్రెస్ లను చూసి కొంతమంది ఆమె మతాన్ని అగౌరవ పరిచిందని అంటుంటే మరి కొంత మంది ఆమె యాడ్లో నటించింది అది వృత్తిలో భాగం అంటూ ఆమెకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: