
ఇప్పుడు సినీ వర్గాల్లో మరో పెద్ద చర్చ జరుగుతోంది — దర్శకుడు రాజ్ నిడ్మూరుతో రెండోసారి వివాహ బంధంలో అడుగుపెట్టబోతుందట సమంత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కానీ, సోషల్ మీడియాలో వారి ప్రవర్తన, కలిసివున్న ఫోటోలు చూసి అభిమానులు “ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా?” అని గుసగుసలాడుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి గురించి చెప్పుకోవాలి. లావణ్య త్రిపాఠి ఎప్పుడూ మీడియా ఫ్లాష్‌లైట్ దూరంగా సైలెంట్‌గా ఉండే వ్యక్తి. కానీ ఆమె కూడా తన సహ నటుడు వరుణ్ తేజ్‌తో ప్రేమాయణం కొనసాగించి, ఎట్టకేలకు మెగా కుటుంబంలో కోడలయ్యింది. తాజాగా ఈ జంట తల్లిదండ్రులు అయి, పండు లాంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ వార్తతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది.
ఇక ఇప్పుడు రష్మిక మందన్నా– విజయ్ దేవరకొండ జంట గురించి వార్తలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఇద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు గౌరవిస్తూనే ఉన్నా, ఇటీవల వీరి చేతుల్లో కనిపించిన ఉంగరాలు అభిమానులను ఉత్సుకతకు గురిచేశాయి. “ఇదే రష్మిక–విజయ్ పెళ్లి సంకేతమా?” అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. దీంతో రష్మిక కూడా త్వరలో తెలుగు ఇంటికి కోడలవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోయిన్లు హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటూ, కొందరిని ఆశ్చర్యపరుస్తూ మరికొందరిని సంతోషపరుస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి “తర్వాత పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరు?” అనే ప్రశ్నపై పడింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా బజ్ ప్రకారం, “భాగ్యశ్రీ బోర్సే” ఇప్పుడు ఈ లిస్టులో నెక్స్ట్ పొజిషన్‌లో ఉందని అంటున్నారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ మధ్య ప్రేమాయణం సాగుతోందనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ పబ్లిక్ ఈవెంట్స్‌లో దగ్గరగా కనిపించడం, సోషల్ మీడియాలో కామెంట్స్, హార్ట్ ఎమోజీల మార్పిడి — ఇవన్నీ ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చుతున్నాయి.ఇప్పుడు అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది — “ఇది నిజంగానే లవ్ స్టోరీనా? లేకపోతే సినిమా ప్రమోషన్ కోసం పక్కా స్ట్రాటజీనా?” అని చర్చిస్తున్నారు. కానీ ఒకవేళ ఈ రూమర్స్ నిజమై, రామ్–భాగ్యశ్రీ పెళ్లి జరిగితే, రష్మిక మందన తర్వాత ఇండస్ట్రీలో “హాట్‌టాక్ ఆఫ్ ది టౌన్”గా నిలిచేది ఖచ్చితంగా భాగ్యశ్రీ బోర్సే అవుతుంది.
సమంత, లావణ్య త్రిపాఠి, రష్మిక మందన్నా తర్వాత భాగ్యశ్రీ పేరు టాలీవుడ్‌లో వచ్చే “నెక్స్ట్ స్టార్ కోడలు”గా వినిపిస్తుండటంతో, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది.ఇదంతా చూస్తుంటే, టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లి సీజన్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఎవరు ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి అంటూ జనాలు వెయిటింగ్. కానీ, అభిమానుల ఉత్సుకత మాత్రం ఆగడం లేదు..!!