
ఉప్పెన సినిమాకి ఆయన పడిన కష్టానికి, చూపించిన డెడికేషన్‌కి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమా కంటెంట్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రా ఎమోషన్ అన్నీ కలిసి బుచ్చిబాబును స్టార్ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ సక్సెస్ తర్వాత ఆయన మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలసి పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరు పెద్ది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు టాక్ వస్తోంది. ఒక పాట, క్లైమాక్స్ సీన్ మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలో చిత్రబృందం షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి ప్రమోషన్‌లలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.
ఇక బుచ్చిబాబు సనా తన డైరెక్షన్ పాయింట్‌తో మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. అభిమానుల మాటల్లో చెప్పాలంటే — “ఉప్పెనలో ఎలాంటి ఎమోషన్ చూపించి హిట్ కొట్టాడో, అదే స్ట్రాటజీని ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా వాడుతున్నాడు” అంటున్నారు.ప్రస్తుత ప్రేక్షకులు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కంటే కూడా కథలోని సహజమైన సన్నివేశాలను, నిజమైన భావోద్వేగాలను ఇష్టపడుతున్నారు. ఆ పాయింట్‌ను బుచ్చిబాబు బాగా అర్థం చేసుకున్నాడు. ఉప్పెనలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి మధ్య వచ్చిన సీన్స్ ఎంత నేచురల్‌గా ఉన్నాయో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు పెద్దిలో కూడా అదే తరహా రియలిస్టిక్ ఎమోషన్‌ను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడట. దీంతో ఆయన ఖాతాలో మరో హిట్ పడిన్నట్లే అంటున్నారు అభిమానులు..!!