
రెండేళ్లకు ఒకసారి ఎక్సైజ్ శాఖ ఈ ఆహ్వానాన్ని చేస్తుంది. గత రెండేళ్ల క్రితం చివరి రెండు రోజుల్లో 45 వేల నుంచి 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. 13వ తేదీ సోమవారం నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు.ఈ వారం రోజుల్లో 13న సప్తమి, 15న నవమి, 16న దశమి, 17న ఏకాదశి, 18న ద్వాదశి మంచి ముహూర్తాలు కావడంతో భారీ దరఖాస్తులు రావచ్చని అంచనాలు ఉన్నాయి.
14వ తేదీ అష్టమి కావడంతో కొంత తగ్గుదల రావచ్చని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. చివరి రోజుల్లో జోష్ పెరిగే అవకాశం ఉండటంతో ఎక్సైజ్ డివిజన్ల వారు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా దరఖాస్తుదారులకు సౌకర్యం కల్పించేందుకు ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.
గత రెండేళ్ల క్రితం మొత్తం 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి అంతకంటే ఎక్కువగా రావచ్చని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు గుర్తించారు. ఈ పోటీ విపరీతంగా మారడంతో లైసెన్సు కేటాయింపు ప్రక్రియలో భద్రతా చర్యలు పెంచాలని అవసరమవుతోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు