
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అందుకు కేంద్రం కూడా సహకరించాలని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీసీ సంఘాలతో హక్కుల కోసం ఈ నిరసనలో పాల్గొనింది. అనంతరం జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య తో కలిసి మీడియాతో కవిత ఇలా మాట్లాడుతూ . బిజెపి, కాంగ్రెస్ పార్టీలను తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలో వారే బీసీ బంద్ లో పాల్గొనడం చాలా నవ్వులాటగా ఉందని బిజెపి ,కాంగ్రెస్ కూడా ఈ బంద్ లో పాల్గొనడం చాలా దారుణమని తెలియజేసింది. బీసీలను కేవలం మభ్య పెట్టేందుకు, మోసం చేసేందుకే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యింది.
బీసీలకు 42 శాతం వరకు రిజర్వేషన్ ఇచ్చేవరకు పోరాటం ఆగదు అంటూ డిమాండ్ చేస్తోంది కవిత. తల్లితోపాటు ఈ నిరసన కార్యక్రమంలో ఆదిత్య కూడా పాల్గొంటూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా ఒక ఫ్లకార్డు చేత పట్టుకొని మరి నినాదాలు చేస్తూ కనిపించారు. కేవలం మా అమ్మ మాత్రమే కాదు ప్రతి ఇంటి నుంచి అందరూ బయటికి వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన అవసరం వచ్చిందనే అభిప్రాయాన్ని తెలియజేశారు. గడిచిన కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతోందని కవితను ఆమె తండ్రి కెసిఆర్ సస్పెండ్ చేశారు. దీంతో కవిత కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇలాంటి తరుణంలో విదేశాలలో చదువుతున్న తన కుమారుడు ఆదిత్య ఇటీవల ఇండియాకు రాగా అనూహ్యంగా ఇలా బంద్ లో పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ సిద్ధమయ్యారా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో మొదలయ్యింది.