 
                                
                                
                                
                            
                        
                        రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే యువతకు 'నైపుణ్యం' పోర్టల్ గేట్‌వేగా మారాలని అధికారులకు సూచించారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. ఈ పోర్టల్ ద్వారా యువత భవిష్యత్తు మెరుగ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.'నైపుణ్యం' పోర్టల్ ప్రత్యేకతలు అనేకం. ఇది అన్ని శాఖల నుంచి డేటాను సమీకరించి నిరుద్యోగులను గుర్తించి, ఏఐ సాంకేతికతతో రెజ్యూమ్‌లు తయారు చేస్తుంది.
వాట్సాప్ ద్వారా జాబ్ అప్‌డేట్‌లు పంపుతుంది. శిక్షణ కేంద్రాలు, రంగాలు, ఖాళీల వివరాలు అందిస్తుంది. ఇండియా, విదేశాల్లోనూ ఉద్యోగాలు చూపిస్తుంది. స్కూల్ స్థాయి నుంచి ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించాలని సీఎం చెప్పారు. రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్‌తో టై-అప్ చేసి క్లాస్ 8 నుంచి విదేశీ భాషల శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ పోర్టల్ యువతను గ్లోబల్ జాబ్ మార్కెట్‌కు సిద్ధం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నవంబర్‌లో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి