జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార గడువు ఇంకా వారం రోజులు కూడా లేదు. దీంతో అన్ని పార్టీల నేతలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నువ్వా నేనా అంటూ ముందుకు సాగుతున్నాయి..అలాంటి ఈ సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు సర్వేలు ఇప్పటికే ఎన్నికల రిజల్ట్ ను బయటపెట్టాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నాయి..ఇదే తరుణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ తాజాగా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

 ఇక్కడ బీజేపీకి 10వేల ఓట్లు కూడా రావని కొంతమంది నాయకులు అంటున్నారని, కానీ గతంలో బీజేపీ పోటీ చేస్తే 25వేలకి పైగా ఓట్లు వచ్చాయని, ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక్కడ గెలుపు కూడా బీజేపీదే అంటూ  గట్టిగా మాట్లాడారు. టిడిపి, జనసేన కార్యకర్తలంతా మాకే సపోర్ట్ చేస్తారని మాకు ప్రచారం నిర్వహించి ఓట్లు కూడా వేసేలా ముందుకు వెళ్తారని  సూచించారు. ఈ విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల ప్రకారం అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ టిడిపి, జనసేన కార్యకర్తలంతా బీజేపీకి సపోర్ట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ కు మేలు అవుతుంది..

ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేసినా ఈ ఓట్లన్ని మాగంటి గోపీనాథ్ కు మాత్రమే పడేవి. ఈసారి ఆయన భార్య సునీత నిలబడింది. కాబట్టి ఆమెకు జనసేన, టిడిపి, సెటిలర్ల ఓట్లు ఎక్కువగా పడతాయని భావించారు. కానీ అది బీజేపీ వైపు మళ్ళితే మాత్రం  సునీతకు నష్టమే జరుగుతుంది. మిగతా ఓట్లలో ఎక్కువ భాగం నవీన్ యాదవ్ కు పడి ఆయన గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి జూబ్లీహిల్స్ లో జెండా పాతేది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: