బంగ్లాదేశ్ క్రికెటర్ గా నేను తన క్రికెట్ లైఫ్ లో చాలాసార్లు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నారంటూ తెలిపింది. మేము జట్టులో ఉన్న సమయంలో చాలా విషయాల గురించి మాట్లాడలేము నిరసనలు కూడా తెలియజేసే అవకాశాలు ఉండవు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో చాలామంది సీనియర్ అధికారులు మద్దతు కోరడానికి తమ ప్రయత్నించాము. ఈ విషయాన్ని మహిళ కమిటీ చైర్ పర్సన్ అయిన నాదల్ చౌదరి, బీసీబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన నిజాముద్దీన్ చౌదరి దృష్టికి కూడా తీసుకువెళ్లాము అయినా కూడా ఇలాంటి ఫలితం దక్కలేదని తెలిపింది
2022 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో మంజురుల్ లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని తాను బోర్డు దృష్టికి కూడా తీసుకువెళ్లాము వారు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే చూపారు. ప్రీ క్యాంప్ సమయంలో కూడా అతను అసభ్యకరంగా ప్రవర్తించేవారు. మహిళ క్రికెటర్లతో కూడా అలాగే వ్యవహరించేవారు. షేక్ హ్యాండ్ సమయాలలో కూడా చాలా అనుచితంగా ప్రవర్తించేవారు. నా నెలసరి గురించి కూడా ఎన్నోసార్లు అడిగి ఇబ్బందికరమైన ప్రశ్నలను వేసేవారు అంటూ జహనార్ ఆలమ్ వెల్లడించింది. అలాగే బంగ్లాదేశ్ మహిళా క్యాప్టెన్ యువ క్రికెటర్ల పైన కూడా చాలా సార్లు చెయ్యి చేసుకుంటుందని ఆరోపణలు చేశారు. అయితే ఈమె చేసిన ఆరోపణలను బీసీబి ఖండించింది. ఆమె మానసిక స్థితి బాగలేదంటూ తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి