జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా అక్కడే ఉండి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సారధ్యంలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బీజేపీ లో ఉండే తెలంగాణ లీడర్లు అంతా వెళ్లి  ఓటర్ల ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఇక్కడ గెలవాలని  ముందుకు వెళుతున్న సమయం లో బీజేపీ నిజామాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన బీజేపీ ఎంపీగా ఉండి ఇలా సొంత పార్టీ పైనే వ్యంగ్యంగా మాట్లాడడం చూస్తే బిజెపి లో ఉండే అధ్యక్షుడు, ఇతర కీలక నేతలతో ఆయనకు పొసగడం లేదని అర్థమవుతోంది. 

తాజాగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా వ్యంగంగా మాట్లాడారు.. నేను జూబ్లీహిల్స్ కి వచ్చి ఫిజికల్ గా ప్రచారం చేయకపోయినా కానీ, సోషల్ మీడియా లో నా ప్రచారం సాగుతోందని తెలియజేశారు. మీరంతా కలిసి ప్రచారం చేసినా నేను చేసినంత ప్రచారం చేయలేరని చెప్పుకొచ్చారు. నేను ప్రచారానికి రావట్లేదని పదే పదే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం మానుకోండి అంటూ విమర్శలు చేశాడు. నిజామాబాదు లో బీజేపీ ని ఎలా కాపాడుకు వస్తున్నానో నా దమ్మేంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చాడు..

 మాగంటి గోపీనాథ్ చనిపోయి ఆరు నెలలు అవుతోంది. అక్కడ ఎన్నిక వస్తుందని మీకు తెలియదా.. ముందుగానే నాయకులంతా ప్లాన్లు చేసుకొని అభ్యర్థులను ప్రకటించారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా నాయకులందరికీ వ్యతిరేకంగా ఆయన మాటలతో విమర్శలు చేశారు. ఈ విధంగా తెలంగాణ బిజెపి పెద్దపెద్ద నాయకుల మధ్య ఉండే ఈగో ప్రాబ్లమ్స్ పార్టీకి శాపంగా మారుతున్నాయి. మరి ధర్మపురి అరవింద్ ఎఫెక్టు జూబ్లీహిల్స్ ఎన్నికలపై పడుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: