జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరి తలుపు తడుతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే పలు సర్వేలు కూడా వచ్చాయి. ఈ సర్వేలో కూడా రెండు పార్టీలకు సమానంగా గెలుపు ఉంటుందని చూపించాయి. మూడు సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెబితే రెండు సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. అలాంటి ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి గామా అనే సంస్థ ఒక సర్వే చేసింది.. ఈ సంస్థ డివిజన్ ల వారీగా ఎవరు గెలుస్తారు ఎవరికి ఏ విధమైన ఓట్లు పడతాయి ఎందుకు పడతాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ సర్వే చేసినట్టు తెలుస్తోంది. మొత్తం పది రోజులపాటు 92 ప్రాంతాల్లో దాదాపు 7,000 మంది అభిప్రాయాలను ఏఐ టెక్నాలజీ వాడి తీసుకున్నారు. ఓటు ఎవరికి వేస్తారు.
ఎందుకు వేయాలనుకుంటున్నారు అనే దానిపై ఈ సర్వే నిర్వహించారు..

 ఈ విధంగా ఓటర్ల నాడిని బట్టి సర్వే పూర్తి చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ.. మరి వారి సర్వే ప్రకారం జూబ్లీహిల్స్ సూపర్ ఇండికా రిజల్ట్ ఇలా ఉండబోతుందట.. ఇందులో ఎక్కువ మంది జనాలు కాంగ్రెస్ గెలుస్తుందని, అది కూడా స్వల్ప తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ 50 శాతం కంటే ఎక్కువ పోలింగ్ అయితే అది బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందని తక్కువ పోలింగ్ అయితే కాంగ్రెస్ కి ప్రెస్ అవుతుందని అన్నారట. అయితే ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 48.50%, బీఆర్ఎస్ కు 45.27% బిజెపికి 6. 23 శాతం ఓట్లు వస్తాయని  తెలుస్తోంది..

 ఈ విధంగా పూటకో మాట రోజుకో సర్వే వస్తూ ఉండడంతో జూబ్లీహిల్స్ లో పూట పూటకు ఓ 10% ఓటర్ల మనసు మారుతుంది అని చెప్పవచ్చు. వీళ్లు సమయాన్ని బట్టి ఎవరికి ఓటేస్తారో వాళ్లే తప్పనిసరిగా గెలుస్తారు. ఏ పార్టీ గెలుస్తుంది అని వారికి భావన అనిపిస్తుందో ఆ పార్టీకి ఓటు వేసి వస్తారు. ఈ విధంగా ఈ 10% ఓటర్లను కాపాడుకోవడానికి అన్ని పార్టీలు అనేక తాయిలాలు అందిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి చూడాలి 14వ తేదీన ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందనేది బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: