ఇటీవల నెల రోజుల క్రితం జమ్ము కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో “జైష్-ఎ-మొహమ్మద్” అనే ఉగ్రవాద సంస్థ పోస్టర్లు బయటపడటంతో సందీప్ చక్రవర్తి అనుమానం వ్యక్తం చేశారు. సాధారణ ఘటనలా కనిపించినా ఆయనకు ఏదో పెద్ద కుట్ర దాగి ఉందన్న భావన కలిగింది. వెంటనే ఆయన ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించారు. పాత కేసుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ పోస్టర్ల వెనుక ఉన్నారని గుర్తించారు. తమ అనుమానం నిజమని తేలడంతో, ఆయన ప్రత్యేక బృందంతో ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.విచారణలో బయటపడిన వివరాలు అధికారులను ఉలిక్కిపడేలా చేశాయి. ఆ పోస్టర్ల వెనుక ఉన్నది ఒక వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్ అని తేలింది. విద్యావంతుల వేషంలో ఉన్న కొందరు ఉగ్రవాద మద్దతుదారులు దేశంలో పెద్ద స్థాయిలో కుట్ర పన్నినట్లు స్పష్టమైంది. సందీప్ చక్రవర్తి బృందం చేసిన సమగ్ర దర్యాప్తులో ఆ మాడ్యూల్ జమ్ము కాశ్మీర్ నుంచే కాకుండా హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ వరకు విస్తరించి ఉందని తేలింది.
తదుపరి ఆపరేషన్లలో పోలీస్ బృందం భారీ ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. దాదాపు 8 మంది ఉగ్రవాదులు, వారిలో ఇద్దరు మహిళలు కూడా, ప్రస్తుతం అదుపులో ఉన్నారు. వీరి వద్ద నుండి లభించిన ఆధారాలు దేశవ్యాప్తంగా ఇంకా ఉన్న ఉగ్ర మాడ్యూల్స్‌పై పెద్ద దర్యాప్తుకు దారి తీశాయి. ఈ అంతటి విజయానికి కారణమైనది సందీప్ చక్రవర్తి చొరవ, తెలివితేటలు, క్రమశిక్షణ.సందీప్ చక్రవర్తి చూపిన ధైర్యం, కట్టుదిట్టమైన వ్యూహం వల్లే ఈ భారీ ఉగ్రకుట్ర దేశంపై విరుచుకుపడే ముందే ఆగిపోయింది. ఆయన తక్షణ నిర్ణయాలు, సున్నితమైన విశ్లేషణ, ఆపరేషన్లలో చూపిన దృఢత్వం అందరికీ స్ఫూర్తిదాయకం. దేశ భద్రతను కాపాడే నిజమైన యోధుడు ఆయన అని అందరూ ఏకవాక్యంగా ప్రశంసిస్తున్నారు.దేశాన్ని రక్షించడమే తన ధర్మం అని నమ్మే ఈ తెలుగు వీరుడు, దేశ చరిత్రలో తన పేరు బంగారు అక్షరాలతో చెక్కించుకున్నాడు. కర్నూలు జిల్లాలో పుట్టిన ఈ సింహం ఇప్పుడు దేశ గర్వకారణం అయింది. ఆయన చూపిన తెగువ, సేవాభావం దేశ యువతకు స్ఫూర్తి మార్గం చూపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి