కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల చూపు ఆ రాష్ట్రం పై పడింది. అలాగే ముఖ్యంగా బీ జే పీ , కాంగ్రెస్ రెండు ప్రధాన పార్టీలు కూడా ఇక్కడ తమ ఆధిపత్యాన్ని చూపడానికి ఎంతో బాగా ప్రయత్నించారు. అందులో భాగంగా అనేక రోజుల పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహించారు. ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల కమిషన్ బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అనేక కట్టు దిట్టమైన ఏర్పాట్లను ఇప్పటికే నిర్వహించింది. ఇకపోతే ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా తాజాగా కొన్ని పార్టీలు మంచి లీడ్లోకే కూడా వచ్చాయి. మరి బీహార్ రాష్ట్రంలో ఇప్పటికే ఓట్ల లెక్కింపు కార్యక్రమం స్టార్ట్ కాగా ప్రస్తుతానికి ఎవరు ఎన్ని స్థానాలలో లీడింగ్ లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుండి బిజెపి గెలుస్తుంది అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఇండియా 66 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, ఇందులో బి జె పి 40 , జేడీయు 24 స్థానాలు , ఇక ఎం జి బి 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా , వీటిలో ఆర్జెడి 35 , కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేకుండా సొంతగా పోటీలోకి దిగిన AIMIM పార్టీ రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇకపోతే బీహార్లో ఏ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను సాధిస్తుంది అనే ఉత్కంఠ బీహార్ ప్రజలతో పాటు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: