బీహార్ ఎన్నికల కౌంటింగ్ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా ఈ పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎండీఏ116 స్థానాలు ముందంజలో ఉండగా, ఇండియా కూటమి 58 స్థానాలలో ఉన్నది. మధ్యాహ్నం కల్లా బీహార్ ఫలితాలలో ఎవరు గెలుస్తారని విషయం తెలియబోతున్నాయి. ఇక సర్వేలు చెప్పినట్టుగానే ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అధిక సంఖ్యలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికి నేతలు, కార్యకర్తలు కూడా సంబరాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు.
1951 తరువాత బీహార్ చరిత్రలోనే ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం 67.13% పోలింగ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో విజయం ఎవరిని వరిస్తుందా? అనే అంశం పైన చాలామంది ఉత్కంఠత నెలకొంది. మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి వైపే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి మరి తుది ఫలితాలు మరికొన్ని గంటలలో తెలియబోతున్నాయి. నవంబర్ 6వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగగా 121 స్థానాలకు జరిగింది.. ఇందులో పురుషులు 62.98% , మహిళలు 71,78% వినియోగించుకున్నారు. మొదటి దశలో 1314 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. నవంబర్ 11 న 122 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద అభ్యర్థులు 1302 మంది పోటీ చేశారు. మరి బీహార్లో ఎవరు అధికారాన్ని చేపడతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి