జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఒక్కొక్క రౌండ్ వారీగా బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నవీన్ యాదవ్, మాగంటి సునీత నువ్వా నేనా అన్నట్టుగానే ప్రచారం చేశారు. ఎన్నికల రిజల్ట్ కూడా ఆ విధంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఫేవర్ గా వస్తుందన్న ప్రదేశాల్లో కూడా పెద్దగా మెజారిటీ చూపించలేదు. అలాగే ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడతాయని అందరూ భావించారు. కానీ రెండు పార్టీలకు సమాన స్థాయిలో ఓట్లు పడ్డట్టే తెలుస్తోంది. ఇంతవరకు బీఆర్ఎస్ కు సపోర్ట్ ఉండే స్థానాల్లో కౌంటింగ్ ఇంకా జరగలేదు. ఒకవేళ బోరబండ లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల లెక్కింపు వచ్చేసరికి బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనేది చాలామందికి అర్థమవుతుంది. 

ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించి పడ్డ ఓట్లు చూస్తే 30 వేల894  ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 29,976 ఓట్లు వచ్చాయి. అలాగే బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,568 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఎన్నికల ఫలితాలు అనేవి వస్తూ ఉంటే రెండు ప్రధాన పార్టీల మధ్య కండ్లు నరాలు తెగే ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఇప్పటివరకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పై స్థాయి సాధించింది. అలాగే మొదటి రెండు రౌండ్లు కూడా కాంగ్రెస్  ఆధిక్యంలో ఉంది. కానీ మూడవ రౌండ్ వచ్చేసరికి బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది.

మొత్తం 211 ఓట్ల ఆధిక్యంతో  కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను వెనక్కి నెట్టేసింది. దీన్ని బట్టి చూస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 918 ఓట్ల మెజారిటీతో ముందు స్థానంలో ఉంది. ఇప్పటికీ నాలుగో రౌండ్ కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది కానీ మూడవ రౌండ్ నుంచి బీఆర్ఎస్ కూడా కాస్త పుంజుకున్నట్టే తెలుస్తోంది. ఒకవేళ నాలుగో రౌండులో కూడా బీఆర్ఎస్ ఆధిక్యం పెంచుకుంటే మాత్రం కాంగ్రెస్ ఓటమి దిశగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు అనేవి రౌండ్ రౌండ్ కు మారుతూ వస్తున్నాయి. మరి చూడాలి 10 రౌండ్ల వరకు ఎవరు ఆధిక్యంలో ఉంటే వాళ్లే గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: