పోలీసులు సంబంధిత కోర్టులన్నింటినీ వెంటనే ఖాళీ చేయించారు. న్యాయవాదులు, క్లయింట్లు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఏ చిన్న అనుమానాస్పద వస్తువు కనిపించినా వెంటనే చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.సీఆర్పీఎఫ్‌కు చెందిన రెండు పాఠశాలల్లోనూ విద్యార్థులు, సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు ధైర్యం చెబుతూనే, భద్రత చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు ..
ఇదిలా ఉండగా, ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారు? ఏ ఉగ్రవాద గుంపు ఈమెయిల్ పంపింది? దాని నిజస్వరూపం ఏంటి? అనే దానిపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ సెల్ కూడా బెదిరింపు మెయిల్ ప్రారంభమైన ఐపి అడ్రస్‌ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఢిల్లీలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు నగరభద్రతను పటిష్టం చేస్తూ, ప్రజలను కంగారు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా హై సెక్యూరిటి పెట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి