విజయవాడ, తిరుపతి, ప్రొద్దుటూరు, కర్నూలు, రాజమండ్రి, ఓబులవారిపల్లి, వేంపల్లి, కమలాపురం, ఆదోని పాలిటెక్నిక్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కళాశాలలు ఇప్పటికే మంచి పేరు గడించినవి కాగా, కొత్త పరికరాలతో మరింత అగ్రస్థానంలో నిలవనున్నాయి. ఈ ఆధునికీకరణ ద్వారా విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.ప్రభుత్వం లక్ష్యం ఈ కళాశాలలను ఎన్‌బీఏ (నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) అత్యుత్తమ గ్రేడ్ పొందే స్థాయికి తీసుకురావడం.
దీని కోసం ప్రయోగశాలలు, ఫ్యాకల్టీ సామర్థ్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు తదుపరి చర్యలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులతో కొనుగోలు ప్రక్రియలు, ఇన్‌స్టాలేషన్ పనులు వేగవంతం చేయనున్నారు. ఈ చర్య రాష్ట్రంలో సాంకేతిక విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను మరింత పెంచుతుందని, పరిశ్రమలతో అనుసంధానం బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి