ఏదైనా ఒక ప్రాంతం మంచి అభివృద్ధి చెందాలి అంటే ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం అనేది అద్భుతంగా ఉండాలి. రోడ్డు మార్గం అనేది అద్భుతంగా ఉన్నట్లయితే ప్రాంతాలు ఆటోమేటిక్ గా డెవలప్ ఆగుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం రోడ్డు మార్గాలు బాగున్నట్లయితే అక్కడికి ప్రజలు ఎలాంటి సమయం లో అయిన , ఎలాంటి సందర్భంలో అయిన రావడానికి వీలు ఉంటుంది. దానితో అనేక పరిశ్రమలను రోడ్డు బాగున్న ప్రదేశాలలో నిర్మిస్తూ ఉంటారు. దానితో దేశం కానీ , ఏదైనా ప్రదేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే రోడ్డు మార్గాలు ఎంతో ప్రధానమైనవి.

ఇకపోతే రోడ్ల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలలో భూసేకరణలు చేసి మంచి రోడ్లను నిర్మించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే అమరావతి ఓ ఆర్ ఆర్ పై మాత్రం అక్కడ రైతులకు పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. గతంలో అమరావతి ఓ ఆర్ ఆర్ గురించి కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర రోడ్డు రవాణా సంస్థ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు 140 అడుగులుగా ఉండనున్నట్లు నిర్ధారించింది. ఇకపోతే తాజాగా మరొక కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కు 140 అడుగుల వెడల్పు చాలదు అనే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా సంస్థ దీనిని ఏకంగా 250 మీటర్లకు పెంచింది.

దానితో అనేక మంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు మరి పావు కిలో మీటర్ వెడల్పు అవసరమా ..? దాని వల్ల ఎకరాలకు ఎకరాలు రైతులు భూములను నష్టపోతారు. దాని వల్ల చాలా మంది   పెద్ద ఎత్తున భూములను కోల్పోయే అవకాశం ఉంది అనే ప్రతిపాదనను కొంత మంది వినిపిస్తున్నారు. మరి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ముందుగా ప్రతిపాదించిన 140 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారా ..? లేక కొత్తగా ప్రతిపాదించిన 250 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: