తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఈ మధ్యనే మాగంటి గోపినాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్,కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ గెలుపొందారు. అయితే ఈ ఉప ఎన్నికలాగే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయని గత కొద్దిరోజుల నుండి ప్రచారం జరుగుతుంది.అయితే ఈ ప్రచారం నిజమే అనేలా తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే..కడియం శ్రీహరి రెండు రోజుల్లో రాజీనామా చేయబోతున్నారని, స్టేషన్ ఘన్ పూర్ లో ఉప ఎన్నిక రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గానే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఓ నివేదిక అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ పై మండిపడిన సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు గట్టిగా అడిగేసరికి స్పీకర్ దానం నాగేందర్,కడియం శ్రీహరి లకు నోటీసులు పంపించారు.అలా కడియం శ్రీహరి దానం నాగేందర్ లు ఈనెల 23న అంటే మరో రెండు రోజుల్లో విచారణకు హాజరు కావలసి ఉంది.కానీ విచారణకు రెండు రోజుల ముందుగానే కడియం శ్రీహరి తాజాగా స్పీకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి మరింత సమయం కావాలని కోరారు. తనపై వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాల కోసం నాకు మరింత సమయం కావాలని స్పీకర్ ని కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించారట. ఇక ఈ విషయం ఇలా ఉండగా మరో రెండు రోజుల్లో కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

కడియం శ్రీహరి రాజీనామాతో స్టేషన్ ఘన్ పూర్ లో ఉప ఎన్నిక రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందరూ అనుకున్నట్లే కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే దానం నాగేందర్ కూడా ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన వస్తారా రారా అనేది చూడాలి. అయితే జూబ్లీహిల్స్ లాగే స్టేషన్ ఘన్పూర్ లో కూడా ఉప ఎన్నికకు వెళ్లి మళ్లీ వాడి వేడిగా రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లి అక్కడ కూడా గెలిచి సత్తా చూపించి బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టాలి అని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోందట.మరి కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా..నిజంగానే కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: