సోషల్ మీడియాలో మల్లాది విష్ణు కు అనుకూలంగా వస్తున్న ప్రకటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి, అయితేచ వాస్తవానికి మల్లాది విష్ణుకే ఇచ్చే అవకాశం ఉంటుందన్నది విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాల మార్పులో భాగంగా మల్లాది విష్ణుకు అసలు టిక్కెట్ దక్కలేదు. మళ్ళీ ప్రభుత్వం మనదే వస్తుంది కాబట్టి అప్పుడు ఏకంగా మంత్రి పదవికి అవకాశం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు అప్పట్లో చర్చ నడిచింది. దీంతో మల్లాది విష్ణు మౌనం వహించారు.
ఈ క్రమంలోనే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌ను తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మల్లాది విష్ణు తిరిగి యాక్టివయ్యారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తరచుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి అత్యంత దగ్గరగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ మల్లాది విష్ణుకే దక్కుతుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పార్టీ వర్గాల్లో దీనిపై భిన్నమైన చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నది వారు చెబుతున్న మాట. ఎందుకంటే వంగవీటి ఆశ కిరణ్ ఎంట్రీ ఇవ్వడంతో సెంట్రల్ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉందన్నది వారు చెబుతున్న మాట. వాస్తవానికి ఆశాకిరణ్ ఏ పార్టీలో చేరతారు అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం ఆమెకి టికెట్ ఇస్తారని ప్రచారం చేస్తుండడం విశేషం. మరి నిజంగానే ఆశకిరణ్ వైసీపీలోకి చేరతారా ఆమె కోసం ఇప్పుడే టికెట్ రిజర్వ్ చేసి పెట్టేసారా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి