తమిళనాడులో మరోసారి రోడ్డు రవాణా సురక్షపై ఆందోళనలు రేకెత్తించే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది .. థెన్‌కాసి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణ ఘటనలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 30 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల అందించిన వివరాల ప్రకారం—మదురై నుంచి శెంకోటై వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్‌పట్టి వైపు వెళ్తున్న మరో బస్సును ఎదురెదురుగా ఢీకొంది.  .ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండడంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో వెంటనే స్థానికులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు .. .


అతి జాగ్రత్తగా కిటికీలు, తలుపులు కట్ చేస్తూ లోపల చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మదురై, తిరునెల్వేలి వంటి పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రమాదానికి కారణంగా అతివేగం, దృష్టిభ్రమ లేదా రోడ్డు పరిస్థితుల లోపాలేనా అన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు .. రెండు బస్సుల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మృతుల వివరాలను గుర్తించేందుకు సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు ..


ఈ ఘటన స్థానికులను తీవ్రగా కలచివేసింది. రోడ్లపై అతివేగంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ రవాణా వాహనాలపై మరింత పర్యవేక్షణ అవసరమని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు అంటూ అక్కడి అధికారులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనికి సబంధించి పూర్తి వివరాలను బయటపెట్టబోతున్నారట.. .!

మరింత సమాచారం తెలుసుకోండి: