అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఒప్పించి, ఆయనకు నామినేటెడ్ పోస్టు (ఏపీఐఐసీ ఛైర్మన్) ఇచ్చి మరీ, రఘురామకు ఉండి సీటు కేటాయించారు. అయినా, ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ హోదా ఆయనకు సంతృప్తిని ఇవ్వడం లేదు. తన సన్నిహితుల వద్ద కూడా ఆయన ఈ విషయంపై తరచూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అందుకే, వచ్చే ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేయడానికి ఆయన పెద్దగా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో జనసేనలోనూ కొంత అసంతృప్తి ఉంది. గతంలో తమకు కేటాయించని ఉండి సీటు విషయంలో, జనసేన ఇన్‌ఛార్జి నాగరాజు ఇప్పటికీ ఎలాంటి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట. మరోవైపు, రఘురామ కృష్ణరాజు ఇప్పటికే నరసాపురం పార్లమెంటు టిక్కెట్ కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, ఆయనను తప్పించి రఘురామకు టిక్కెట్ ఇవ్వడం అంత సులభం కానప్పటికీ, ఈసారి ఆ సీటును టీడీపీ కోటాలో తనకు కేటాయించాలని ఆయన గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.మొత్తంగా, రాష్ట్ర రాజకీయాలపై విసుగు చెందిన రఘురామ, తన అనుభవాన్ని ఢిల్లీ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ కీలక నిర్ణయం టీడీపీ, జనసేన కూటమిలో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందో, గోదావరి జిల్లాల రాజకీయాలపై ఆయన పోరాటం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఆయన పట్టుదల నరసాపురం టిక్కెట్‌ను సాధించిపెడుతుందా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి