ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశారు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఆయన ఓట్ షేరింగ్ మాత్రం అలాగే ఉంది. జగన్ బయటికి వస్తే ఆయన వెంట ప్రజలు చీమలదండులా వస్తున్నారు. కానీ జగన్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేయడం లేదు. దీనికి తోడు జగన్ జంబ్లింగ్ పిచ్చి వల్ల సొంత పార్టీ నేతలే టార్చర్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కూ మొహం తెలియని అభ్యర్థులను తమకు పట్టున్న నియోజకవర్గాల నుండి తొలగించి కనీసం అక్కడి ప్రజలతో ఎలాంటి కనెక్షన్ లేని నియోజకవర్గం లో నిలబెట్టి ఘోర ఓటమికి కారణమయ్యారు. 

అంతేకాదు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరన్నర కావస్తున్నా కూడా ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను నియమించలేదు. కొన్నిచోట్ల కుల సమీకరణాలు చూసుకొని అక్కడికి నేతలను పంపిస్తున్నారట.కానీ ఆ నేతలు మాత్రం అక్కడి వారితో మాకు ఎలాంటి కనెక్షన్ లేదని చెప్పినా కూడా జగన్ వినడం లేదట. కచ్చితంగా వెళ్లాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారట.ఇక జగన్ జంబ్లింగ్ పిచ్చి వల్ల చాలామంది సొంత పార్టీ నేతలు విసుగు చెందుతున్నారట. అంతే కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో జంబ్లింగ్ వల్ల ఎక్కడెక్కడో నియోజకవర్గాలకు వెళ్లిన నేతలంతా మళ్ళీ మాకు పాత  నియోజకవర్గాలు కావాలి అని అడుగుతున్నారట.

 అంతేకాదు జగన్ తీరు వల్ల విడదల రజనీ వంటి వాళ్లు వెళ్తే పాత నియోజకవర్గానికి వెళ్తాం లేకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి ఇంట్లో ఉంటాం అని సంకేతాలు కూడా జారీ చేస్తున్నారట. అయినా కూడా జగన్ వారిని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు తప్ప ఆయన జంబ్లింగ్ పిచ్చిని మాత్రం మర్చిపోవడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది ఇతర నియోజకవర్గాలకు వచ్చిన నేతలు ఇప్పుడు ఖర్చుపెట్టి లాభం లేదని,ఎన్నికలకు ఆరు నెలల ముందు కూర్చొని జగన్ తో ఏదో ఒకటి సెటిల్ చేసుకొని పాత నియోజకవర్గాలకే వెళ్ళిపోతామని నిర్ణయించుకొని కనీసం నియోజకవర్గాల్లోని ఏ సమస్యలపై కూడా నోరు విప్పడం లేదని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: