తెలంగాణ రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారం లో ఎంతో మందిని విచారించినటు వంటి దర్యాప్తు బృందం తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ మరియు హరీష్ రావు లకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ కేసు వ్యవహారం లో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ను ఎంత విచారించినా కానీ దీనికి సంబంధించిన వివరాలు సరిగ్గా చెప్పడం లేదు. దీంతో ఇందులో పూర్తి స్థాయి సమాచారం రావాలి అంటే  ప్రధాన వ్యక్తులని విచారించాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

 ముఖ్యంగా మావోయిస్టులతో సంబంధం లేని వ్యక్తుల ఫోన్ల పై నిఘా ఉంచాల్సిన అవసరం ప్రభాకర్ రావు కి ఎందుకు వచ్చింది అనే అంశం పై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. కానీ దీనిపై ప్రభాకర్ రావు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో సిట్ మరో కోణం లో దర్యాప్తు చేయాలని అనుకుంటుంది. ఇదే తరుణం లో  కేసీఆర్ ఓఎస్డిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ని  విచారించే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చే ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కు కూడా నోటీసులు ఇచ్చి విచారించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు లో నిందితులైనటు వంటి ప్రణీత్ రావు, శ్రావణ్ రావు లతో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేసినట్టు సిట్ దర్యాప్తు లో వెల్లడయ్యింది.. దీనిపై అనుమానం వ్యక్తం చేసినటువంటి సిట్ బృందం హరీష్ రావు, కేసీఆర్ లను విచారించాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.  ఇదే జరిగితే రాష్ట్రం లో రాజకీయ పరిణామాలు చాలా వరకు మారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: