పశ్చిమబెంగాల్ లో రాజకీయాలనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ఇక్కడ మమతా బెనర్జీకి చాలా పట్టు ఉంది. అలాంటి మమత పట్టు 2026 ఎన్నికల్లో సడలి పోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పాగా వేసేందుకు బీజేపీ శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేయబోతున్నట్టు తెలుస్తోంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ , రెండవది భారతీయ జనతా పార్టీ.. మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది.. 2021 లో జరిగిన ఎలక్షన్స్ లో  ఇక్కడ పట్టు సాధించాలని ఎంతో ప్రయత్నించింది భారతీయ జనతా పార్టీ.. కానీ తృణముల్  కాంగ్రెస్ పార్టీ ముందు బిజెపి నిలవలేకపోయింది. 

ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ స్ట్రాటజీ లు పాటించే వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి అధికారంలోకి వచ్చింది. అంతేకాదు వీల్ చైర్ లో ప్రచారానికి వెళ్లిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ  సింపతి క్రియేట్ చేసింది.. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయింది. ఇదే సమయంలో అసలు బెంగాల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఎలా అధికారంలోకి వస్తుంది అనే దానిపై బీజేపీ కసరత్తు చేసింది.పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం వెంబడి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలోకి ఇతర వ్యక్తులు చొరబాటు అవుతున్నారు. దీనివల్ల వారి ఓట్లు అత్యధికంగా ఉండి ఆ ఓట్లన్నీ దిదీ వైపే ఉండడంవల్ల ఈమె సునాయాసంగా   అధికారంలోకి వస్తుంది. అలాంటి ఈ తరుణంలో దాదాపు 50 లక్షలకి పైగా దొంగ ఓట్లను ఈసారి తొలగించే ప్రయత్నం చేస్తుంది బిజెపి. ఒక్కొక్కరు అడ్రస్సులు తప్పుగా పెట్టుకుని నాలుగు నుంచి ఐదు ఓట్లు సంపాదించారు.. అంతేకాదు స్థానికంగా ఇక్కడ ఎలాంటి హక్కులు లేని వారు కూడా ఓట్లు సంపాదించి ఆ ఎలక్షన్స్ లో ఓట్లు వేస్తున్నారు.

 వీటన్నింటిని ఏరేసే ప్రయత్నం చేస్తోంది బిజెపి అధిష్టానం. మొత్తం 54 లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసింది. అంతేకాదు పశ్చిమబెంగాల్ లోని ఏఏ నియోజకవర్గాల్లోని ఏ మండలాలు ఏ గ్రామాల్లో ఎక్కువగా రిగ్గింగ్ జరుగుతుందనే దానిపై ఇప్పటికే డాటా కలెక్ట్ చేసింది బిజెపి అధిష్టానం. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సెక్యూరిటీ ఇచ్చి దొంగ ఓట్లకు తావు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కీలక నాయకులుగా ఎదిగినటువంటి వారి పిల్లలను తీసుకువచ్చి బిజెపిలో చేర్చుకుంటున్నారట. వారికి రాజకీయంగా అక్కడ అవకాశాలు ఇచ్చి బిజెపిని బలపరిచే విధంగా ప్లాన్ చేస్తోంది. ఈ విధంగా పలు స్ట్రాటజీలు ఉపయోగించి బిజెపి పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మరికొన్ని నెలలో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: