ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. అయితే మోడీ పాలన మెచ్చి ఎంతోమంది బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు.  అలాంటి ఈ తరుణంలో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ఇతర పార్టీలను ఓడించి పూర్తిస్థాయి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఒకవేళ బీజేపీ ఈ రాష్ట్రాల్లో బలపడితే మాత్రం తాను అనుకున్నది సాధించినట్టే.. మరీ ముఖ్యంగా ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ గెలిచింది అంటే ఇక కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే.. మరి ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటి.. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ నిజంగానే బలపడుతుందా.. లేక కాంగ్రెస్ గెలుస్తుందా అనేది చూద్దాం.. త్వరలోనే దేశంలోని కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇందులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అస్సాంలో అధికారంలో ఉంది. అక్కడ మళ్లీ గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. 

కానీ ఇక్కడ ఫెయిల్ అయితే కాస్త వెనకబడిపోయినట్టే.. అయితే బిజెపి ఎక్కువ ఫోకస్ పెట్టిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్.. ఇక్కడ బిజెపి 150 సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది.. మమతా బెనర్జీ కూడా 218 వరకు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది.  కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సపరేట్ గా పోటీ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి బిజెపిని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో కూడా బీజేపీ అక్కడ గెలిచింది అంటే ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే కాకుండా తమిళనాడులో కూడా బిజెపి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈసారి విజయ్ టీవీకే పార్టీ ద్వారా ప్రజల్లోకి రాబోతున్నారు.

విజయ్ గెలుస్తాడా లేదంటే ఏఐడీఎంకే అధికారంలోకి రావడానికి డీఎంకే ఓట్లు చీలుస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.. ఇక మరో రాష్ట్రం కేరళ..ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని యూడిఎఫ్ విజయం సాధించింది. లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ కాస్త బీజేపీ కూడా పుంజుకుందని చెప్పవచ్చు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కాంగ్రెస్ గెలిచేలా ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే బిజెపికి తెలియకుండానే కాంగ్రెస్ కు సపోర్టెడ్ గా వెళ్తోంది. ఈ విధంగా ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులు ఉన్నాయి. ఇందులో తమిళనాడు, బెంగాల్లో  బిజెపి  కూటమిలోని పార్టీలు గెలిస్తే మాత్రం ఇక కాంగ్రెస్ శకం ముగిసినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: