తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ అలాగే లెఫ్ట్ పార్టీలలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఉన్నాయి. ఇందులో అత్యంత ఆదరణ సంపాదించిన పార్టీలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, మాత్రమే..ఇక బీజేపీ రాబోవు రోజుల్లో  బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది.. అలాంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాబోతున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ తెలంగాణ లో అసెంబ్లీ ఎలక్షన్స్ సమయానికి  కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తాజాగా ప్రకటించింది.. ఆమె పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి మరో ప్రాంతీయ పార్టీ కవిత ద్వారా రాబోతోంది. ఇప్పటికే ఆమె జాగృతి అనే సంస్థను స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సంస్థను తన సొంత పార్టీగా మలుచుకోబోతోందని తెలుస్తోంది. 

పార్టీ ద్వారా మహిళల హక్కుల కోసం పోరాడుతానని ఆమె చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా తన  రాజీనామాను కూడా ఆమోదించాలని ఇంకో ఆలోచన లేదంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఇరిగేషన్ కోసం లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. కానీ పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు అంటూ విమర్శించింది. అదే మేము వస్తే అద్భుతం చేస్తామంటూ మాట్లాడుకు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అద్భుతం జరుగుతుందని ప్రజలంతా భావించారు.కానీ మా నాన్నను డైవర్ట్ చేసి పార్టీని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించుకొచ్చింది. కేసీఆర్ మంచి వాడే కానీ తన చుట్టూ ఉన్న వ్యక్తులే మోసం చేస్తున్నారని చెప్పకనే చెప్పింది.

మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఒక సొంత పార్టీ ద్వారా ఎలక్షన్స్ లోకి రాబోతుందని అర్థమవుతుంది. ఈమె లాగే గతంలో వైయస్సార్టీపీ పార్టీ పేరుతో షర్మిల కూడా ఒక పార్టీ పెట్టింది. కానీ చివరికి కాంగ్రెస్ లో విలీనం చేసి సైలెంట్ అయిపోయింది. అంతేకాదు కోదండరాం కూడా ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారు.. షర్మిల అయితే ఏ విధంగా చేసిందో కవిత కూడా సొంత అన్నను, బావను, పార్టీని విమర్శిస్తూ వస్తోంది. మరి ఈ పార్టీ ద్వారా సక్సెస్ అవుతుందా లేదంటే చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: