తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ సమావేశానికి ముందే కాంగ్రెస్‌పార్టీ తమ వైఖరి చెప్పాలని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని బట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని, సమావేశానికి పార్టీ నుంచి ఒక్కరినే ఆహ్వానించాలని కోరారు. తమ పార్టీలో దీనిపై ఏకాభిప్రాయం ఉందని, పార్టీ నుంచి సమావేశానికి ఒక్కరే హాజరవుతారని అన్నారు. మిగిలిన పార్టీలే రకరకాలుగా మాట్లాడుతున్నాయిని, తాము అఖిలపక్షానికే రాబోమని బీజేపీ, సీపీఐ చెబుతున్నాయి. తమది కొత్త పార్టీ కాబట్టి ఏ వైఖరీ లేదని వైసీపీ తప్పించుకొంటోందని కాని తెదేప మాత్రం తన వైఖరి పి స్పష్టంగా ఉందని అన్నారు. చూడాలి ఇంకా డిసెంబర్ 28 కి ఇరవయ్ రోజులున్నాయి, ఇంకా ఏ పరిణామాలు జరగనున్నాయో. 

మరింత సమాచారం తెలుసుకోండి: