రాష్ర్టాన్ని కుదిపేస్తున్న విద్యుత్ కోత అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధింపొందేందుకు తెలుగుదేశం పార్టీ చురుకుగా ఎత్తుగడలు వేస్తోంది. విద్యుత్ సరఫరాను మెరుగుపరిచే పరిస్థితి ప్రస్తుతానికి లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖరాకండీగా తేల్చిచెబుతుండటంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు పొందాలని టీడీపీ యత్నిస్తున్న విశ్వసనీయ సమాచారం. రాష్ర్టంలో అత్యధిక శాతం మంది వ్యవసాయంపై ఆధార పడి ఉండటం, ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రోజుకు కనీసం ఏడు గంటలైన విద్యుత్ ను ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులకు అండగా నిలిస్తే రానున్న 18 నెలల్లో జరగే సాధారణ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధిపొందవచ్చునన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి, కాగా రైతుల తర్వాత అత్యధికంగా ఉన్న చేనేత కార్మికులను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల క్రితం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేసి సక్సెస్ అయిన నేపథ్యంలో టీడీపీ సైతం చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటిదాక రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న ప్రజాసమస్యలపై సాధ్యమైంత ఎక్కువగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటీవలి ఉప ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదుర్కోవలసి వచ్చిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్న తెలుస్తోంది. రైతులను గురించి ఎంత చెప్పినా గతంలో చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటూ అదికార పక్షం ఎద్దేవ చేస్తున్న నేపథ్యంలో ఆ మచ్చ తొలగించుకొని రైతులు విశ్వాసం పొందాలంటే సాధ్యమైంత ఎక్కువగా రైతుల సమస్యలపై పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: