కొన్ని సంఘ‌ట‌న‌లు చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా రాజ‌కీయాల్లో అయితే ఈ విష‌యాలు ఇంకా శాస్వ తంగా ఉంటాయి. రోజులు పాత‌బ‌డొచ్చు కానీ.. విష‌యాలు మాత్రం కొత్త‌గానే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే నాలుగు రోజుల కింద‌ట జ‌రిగిన ఓ విష‌యంపై రాజ‌కీయ మేధావులు ఇప్ప‌టికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఏపీ సీఎంగా జ‌గ‌న్ ఉన్నాడు కాబ‌ట్టి.. `అలా జ‌రిగింది` కానీ, అదేస్థానంలో చంద్ర‌బాబు ఉండి ఉంటే. ప‌రిస్థితి మ‌రోరూపంలో ఉండేద‌ని అంద‌రూ అనుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వ కొలువుదీరింది. 


ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్నాళ్లుగా వినిపిస్తున్న జ‌మిలి ఎన్నిక‌లు అనే స‌బ్జెక్ట్‌పై ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే దేశంలోని దాదాపు అన్ని రాజ‌కీయ పార్టీల అధ్య‌క్షుల‌తోనూ నాలుగు రోజుల కింద‌ట ఢిల్లీలో స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనికి టీడీపీ స‌హా దేశంలోని కొంద‌రు రాలేదు. అయితే, ఏపీ నుంచి వైసీపీ అదినేత హోదాలో సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ నుంచి టీఆర్ ఎస్ కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడి హోదాలో కేటీఆర్ హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి ఈ స‌మావేశం అజెండా మాత్రం.. జ‌మిలి ఎన్నిక‌లు. అయితే, జ‌గ‌న్ మాత్రం ఈ స‌మ‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. 


ఇప్పుడున్న ప‌రిస్థితిలో కేంద్రంలోని పెద్ద‌లు జ‌గ‌న్‌కు ఇప్పుడు ఎన‌లేని విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ ఈ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను త‌న‌కు ప‌క్క‌గా కూర్చోబెట్టుకున్నారు. వాస్త‌వానికి మోడీ ఇంత ప్రాధాన్యం ఇచ్చిన త‌ర్వాత‌.. తొలిసారి రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో మోడీకి కానీ, కేంద్రానికి కానీ, పార్ల‌మెంటుకు కానీ వ్య‌తిరేకంగా మాట్లాడే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేరు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఒక్క‌మాట‌లో చెప్పాలంటే .. మోడీకి మంట‌పుట్టిం చే మాట‌లే మాట్లాడారు.  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని బీజేపీ పెద్ద‌లు చెబుతున్నా.. దీనికి ఎలాంటి వెనుకంజ వేయ‌కుండా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు జ‌గ‌న్‌.


పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి ఏపీని విడ‌గొట్టారు. మ‌రి అలాంట‌ప్పుడు హోదా ఇవ్వ‌కుండా ఇలా దొంగాట‌కం ఆడ‌డం, పార్ల‌మెంటును అవ‌మానించిన‌ట్టు కాదా? అని ఎలాంటి సందేహం లేకుండా మోడీని ఆయ‌న ప‌రివా రాన్ని క‌డిగి పారేశారు. మొత్తంగా 27 నిమిషాలు మాట్లాడిన జ‌గ‌న్‌.. ప్ర‌తి వాక్యంలోనూ ప్ర‌త్యేక హోదా అంశాన్ని లేవ‌నెత్తారు. స‌రే! ఇది వ‌స్తుందా?  రాదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మోడీ కూర్చున్న స‌భ‌లో ఆయ‌న కు ప‌క్క‌నే కూర్చున్న జ‌గ‌న్ ఈ విష‌యంలో ఈ రేంజ్‌లో మాట్లాడ‌డం నిజానికి సంచ‌ల‌న‌మే! అయితే, జ‌గ‌న్ ప్లేస్‌లో చంద్ర‌బాబు ఉంటే.. ఏం జ‌రిగేద‌న్న కోణంలో మేదావులు దృష్టి పెడుతున్నారు! నిజానికి బాబు ఆ ప్లేస్‌లో ఉంటే.. ముందు మోడీని పొగిడి.. త‌ర్వాత త‌న‌ను పొగిడించుకుని న‌మ‌స్కారం పెట్టేవార‌ని న‌వ్విపోస్తున్నారు!!



మరింత సమాచారం తెలుసుకోండి: