మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంత్రాలయలోని నాలుగో అంతస్తులో షార్ట్ సర్కూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నాలుగో అంతస్తులో విధులు నిర్వహిస్తున్న సుమారు 30మంది మంటల్లో చిక్కుకున్నారు. కాగా వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషిసలుపుతున్నారు. మంత్రాలయలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపు 25 అగ్నిమాపక దళాలు తీవ్రంగాయత్నిస్తున్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ అగ్నిప్రమదం కారణంగా పలువరు సచివాలయ ఉద్యోగులు స్వల్పంగా గాయడ్డారు. ఇదిలావుండగా మంటల మరింత చెలరేగి ఆరవ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నాలుగు, ఐదు అంతస్తులలోని కీలకమైన ఫైళ్ళు అగ్నికి ఆహాతయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: