అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో చంద్ర గమనం సరైన మార్గంలోనే జరుగుతున్నట్లు కన్పిస్థుంది. పలితం ప్రయోగం పూర్తయితే కాని తెలియదు. గమనం బట్టే పలితాన్ని ఊహించుకోవడం తప్ప.  వస్తున్నా మీకోసం ...ప్రయోగం రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేరుకోవడం కోసం. దీని కోసం ప్రజల్లో పట్టు సాధించాలి, మంచోడు అన్న పేరు తెచ్చుకోవాలి. అది జనంలోకి వెల్లి సమస్యలు తెలుసుకుంటూ, వాటిపై పార్టిశ్రేణులను పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా కదిలిస్థూ ముందుకు వెలుతున్నారు. రెండోది అధికారానికి ఉన్న అడ్డంకులు తొలగించుకోవడం. ఆయన భావిస్థున్న రెండు ప్రధాన అడ్డంకులు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రేస్, ఉపఎన్నికల్లో బలం చూపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రేస్.  దీనికోసం ప్రజల్లో అధికారకాంగ్రేస్, వైఎస్ఆర్ సిపిల అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు. ప్రజలకు అర్థమయ్యేతీరులో వివరిస్థూ సందుదొరికినప్పుడల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆసమయంలో జనం నుంచి వస్థున్న స్పందనను బట్టి మరింత వాడిని పెంచుతున్నారు. అంతే కాదు పాదయాత్రతో చేసేది చేస్తూ అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో ప్రత్యర్థులను దెబ్బతీసే పనులు వేగవంతం చేసారు.  ఒక్కదెబ్బకు రెండుపిట్టలు అన్నసామెతను అమలుచేస్తున్నారు. ఇటు జనంలో వారిని పలుచన చేస్తూనే తన పార్టి ఎంపీలను ఢిల్లి వెల్లి అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రహోంమంత్రిని కలసి వినతిచేయించారు. అంతటితో ఆగకుండా ఆర్థికనేరాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని నివారించాలని ఏకంగా ప్రధానమంత్రి వద్దకు వెల్లి వినతి చేస్తున్నారు. ఇవన్నీ కాంగ్రేస్ మంత్రులు,నేతలు, జగన్ లను టార్గెట్ చేసేవే. అయితే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందా అన్నది అనవసరం, ప్రజలముందు మాత్రం పోరాడుతున్నట్లు కన్పిస్థే బాబు లక్ష్యం నెరవేరినట్టే. మొత్తం మీద చంద్రబాబు ప్రయాణం రాష్ట్రరాజకీయాల్లో కీలకం కానున్నదన్నది మాత్రం వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: