మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు.. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సంతోషాలు ఎన్నడూ వుండవు.. భగభగమండే చెట్టుపై వాలడానికి ఏ పక్షి ముందుకు రాదు. ఒకవేళ వచ్చినా ఆ మంటలకు మాడి మసై పోవడం ఖాయం. అలా ఎప్పుడూ కోపంతో రగిలి పోయే వారికి సంతోషాలు అంటూ ఏవి ఉండవు. ఎందుకంటే ఎవరైతే ఎప్పుడూ కోపంగా ఉంటారో, వారి దగ్గరికి ఎవరూ రారు. పైగా మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువ. కోపంతో రగిలి పోయే వారితో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించరు. మండే చెట్టు ఎంత ప్రమాదకరమో కోపంతో రగిలి పోయే వ్యక్తి కూడా అంతే ప్రమాదకరం అని దీని అర్థం..