గెలిచిన వాడికి, ఓడిన వాడికి మధ్య తారతమ్యం తెలిసినవాడే నిత్యం సుఖంగా ఉండగలుగుతాడు..!దీని అర్థం ఏమిటంటే..గెలిచినవాడు చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఓడిన వాడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతాడు. కానీ ఓడిన ప్రతి ఒక్కరు ఏడుస్తూ కూర్చుంటే, మరోసారి విజయం వారిని దరిచేరదు. ఇక గెలిచినవాడు విషయానికి వస్తే, గెలిచానన్న అహంకారం తలకెక్కితే, అతడు కూడా ఇంకొకసారి విజయాన్ని చవి చూడ లేడు.. కానీ ఓటమికి, విజయానికి మధ్య ఉన్న తారతమ్యం ఏంటో తెలిసిన వాడు మాత్రం ఎప్పటికీ సుఖంగానే ఉంటాడు.