ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యుడు - సులేఖ అనే దంపతులకు జన్మించాడు.హిరణ్య ధన్యుడు జరాసంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు. దానివల్ల జరాసంధుడి యుద్ధాలలో పాల్గొని ఒక యుద్ధంలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించడం వల్ల ఏకలవ్యుడు వారి తెగకు చిన్నవయసులోనే రాజు అయ్యాడు. ఇక విలు విద్యను నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, ద్రోణాచార్యుడు నిషాద కులానికి చెందిన వాడు నీవు.. నీకు విలువిద్య నేర్పను అని చెప్పాడు. కానీ ఏకలవ్యుడు పట్టువీడని విక్రమార్కుడు లా ద్రోణాచార్యుడి బొమ్మను తయారు చేసి , విలువిద్యలో అర్జునుడి ని మించిన నేర్పును సాధించాడు.