జీవితంలో పైకి ఎదగాలి.. బహుశా.. ఈ ప్రపంచంలో ఈ ఆలోచన చేయని మనిషి అంటూ ఉండడు. జీవితంలో అత్యంత సోమరిపోతు అయినా...ఈ ప్రపంచాన్ని దున్నేద్దామనే అనుకుంటాడు.. మరి సోమరిపోతే అంతగా ఆలోచిస్తే.. మామూలు వాళ్లు తక్కువా.. వాళ్లు కూడా మంచి టార్గెట్లే పెట్టుకుంటారు..
![]()
జీవితంలో అత్యంత ధనవంతుడిని అవ్వాలని కొందరు కోరుకుంటే.. ఈ దేశాన్నే ఏలేయాలని కలలు కంటారు ఇంకొందరు.. సినిమా స్టార్ గా మారి కోట్లాదిమంది ఫ్యాన్స్ కు ఆరాధ్యదైవంగా మారాలని కొందరు అనుకుంటే... గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేయాలని ఇంకొందరు తపన పడుతుంటారు.

ఇలా కోరుకోవడంలో.. ఆలోచించుకోవడంలో ఎలాంటి తప్పులేదు.. పైగా అలా ఆలోచించకపోవడమే నేరం. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే.. ఆశలు ఆకాశంలో ఉంటే.. దానికి అవసరమైన కార్యాచరణ మాత్రం పాతాళంలో ఉంటుంది. కేవలం ఆశలే తప్ప ఎలాంటి ప్లానింగ్ ఉండదు. మరి ఇలాంటి వాళ్ల ఆశలు నెరవేరతాయా..?
అందుకే ఉన్నత లక్ష్యాల గురించి ఆలోచించేవాళ్లు ముందు.. తమ కార్యాచరణ శక్తిని అంచనా వేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే.. నువ్వు ఓ కొండను ఎత్తాలని టార్గెట్ గా పెట్టుకున్నావనుకో.. మందు చిన్న చిన్న రాళ్లు ఎత్తేందుకు ప్రయత్నించాలి.. అలాంటిది లేకుండా ఊరికే కలలు కంటూ కూర్చుంటే.. అవి పగటి కలలు కానే మిగిలిపోతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి