ఒకప్పుడు ఒకపెద్దచెట్టు మీద ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. అవి దూరదృష్టి కలిగి ఉండడమే కాకుండా, అవసరాన్ని బట్టి చాలా కష్టపడి పనిచేసేవి. అది చలికాలం ఆ పిచ్చుకలు ముందుగానే ఆ కాలానికి తగ్గట్టుగా బలంగా ఉన్న గూడును నిర్మించుకున్నాయి. అందువల్ల అవి చాలా ఆనందం గా ఉన్నాయి. ఒకరోజు వానలో ఒక కోతి పరిగెత్తుకుంటూ ఆశ్రయం కోసం ఆ పిచ్చుకలు ఉంటున్న చెట్టు కిందకు వచ్చింది.


అది చాలా తడిచిపోయి చలికి బాగా వణుకుతోంది. ఇదంతా గమనిస్తున్న పిచ్చక భార్య కోతితో కుతూహలంగా కోతి గారు ఎందుకు మీరు ఇంటికి వెళ్లకుండా ఈ వానలో ఇలా పరిగెడుతున్నారు. దానికి ఆ కోతి నాకంటూ ఇల్లు ఏమి లేదు. నేను వివిధ రకాల చెట్ల పైన నివసిస్తూ ఉంటాను. అని సమాధానమిచ్చింది. దానికి ఆ పిచ్చుక భార్య కోతి బద్ధకాన్ని భవిష్యత్తు గురించి తెలివిగా ఆలోచించకపోవడాన్ని విమర్శించటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ కోతి కోపంగా అడగకుండానే సలహా ఇచ్చినందుకు పిచ్చుక కు చివాట్లు పెట్టింది.

అయినప్పటికీ ఆ పిచ్చుక మాటలు ఆపకుండా ఇంకా కోతితో ఇలా అంటూనే ఉంది. నాకు చిన్న ముక్కు మాత్రమే ఉంది అయినా కూడా చాలా మంచి గూడును నాకోసం నిర్మించుకున్నాను. నీకు చాలా బలమైన చేతులు, భుజాలు ఉన్నప్పటికీ నువ్వు వాటిని ఉపయోగించి..నీ కోసం ఒక ఇంటిని నిర్మించుకోవటానికి నీకు చాలా బద్ధకం..నన్నడిగితే అది నీకు చాలా అవమానకరం అని అంది. ఆ మాటలకు కోతికి చాలా కోపం వచ్చింది పిచ్చుక మీద,  అది వెంటనే చెట్టు పైకి గెంతి ఆ మూర్ఖపు పిచ్చుక గూటిని, ముక్కలు ముక్కలుగా పీకి పారేసింది. కోతి ప్రవర్తనకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. కానీ అది కోతి కి వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోయింది. తన ప్రవర్తన పట్ల తనకే హాని కలిగిందని బాధ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: