ఒక ఊరిలో రాజమ్మ, రంగయ్య అనే భార్య భర్తలు ఉండేవారు. వీరిద్దరూ మహా పిసినారులు.. పిల్లికి కూడా భిక్షం పెట్టేవారు కాదు. సంపాదించిన డబ్బులు దాచుకోవడం తప్పా..దానం చేయాలంటే గిలగిల్లాడి పోయేవారు. ముఖ్యంగా ఇంటికి చుట్టుపక్కలు రావడం.. ఆ దంపతులకు అస్సలు ఇష్టం లేదు.. బంధువులు ఎందుకు దండగ..ఊరికే వచ్చి తిని పోతారు అని విసుక్కునే వాళ్లు. ఒక రోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతూ ఉండగా దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో..బంధువులు వస్తే కొంప గల్లంతు అయిపోతుంది అని గబగబా లోపలికి పరుగెత్తింది. తన భార్యతో ఇదిగో నిన్నే మా చుట్టాలు వస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉండకుండా చేయాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అన్నాడు.

వెంటనే రాజమ్మ.. అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించగా.. నువ్వు.. నీకు అనారోగ్యం చేసినట్లు నటించు అని చెప్పాడు రంగయ్య. వాకిట్లోకి వచ్చేటప్పటికీ రాజమ్మ కింద పడి దొర్లుతూ అమ్మో కడుపునొప్పి.. చచ్చిపోతున్నాను.. ఇక బ్రతకనేమో..నేను ..దేవుడా నువ్వే నన్ను బ్రతికించెను.. అంటూ గిలగిల్లాడసాగింది.. అప్పుడు రంగయ్య నేనేం చేయనే వైద్యుడిని తీసుకొద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు అంటున్నాడు రంగయ్య. చుట్టాలు ఇది విని పాపం వీళ్ళ కష్టం లో ఉన్నట్టున్నారు అనుకుని వెను తిరిగి వెళ్లిపోయారు. ఇక తమ ఎత్తుగడ ఫలించినందుకు రాజమ్మ రంగయ్య పొంగిపోయారు. అప్పటినుంచి భర్త తరపు బంధువులు వస్తే భార్య.. భార్య తరఫు బంధువులు భర్త నటిస్తూ జీవితాన్ని కొనసాగించడం జరిగింది.


ఇక పోతే వాళ్లకు ఒక్కగానొక్క కూతురు శారదను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళని విచారించగా.. ఏమిటో పాపం ఈ అమ్మాయి మంచిదే.. తల్లిదండ్రులకు ఎప్పుడూ అనారోగ్యం అని చెప్పారు అయితే ఆ సంబంధం చేసుకోవడం వృథా అని  వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.. ఈ విషయం తెలుసుకున్న రాజమ్మ, రంగయ్య పశ్చాత్తాపం చెందారు..అందుకే  మోసం చేస్తే ఎవరికైనా నష్టం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: