తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తన ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన వారిలో నటుడు రంగనాథ్ కూడా ఒకరు. ఇక ఈయన పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. 1949 జూలై 17వ తేదీన టిఆర్ సుందరరాజన్, జానకి దేవి దంపతులకు మద్రాసులో జన్మించాడు. ఇక  తిరుమల శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత కొంతకాలం రైల్వేశాఖలో టీ సీ (టికెట్ కలెక్టర్) గా పనిచేసి, నటన మీద ఆసక్తితో 1969లో బుద్ధిమంతుడు అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.


అలా  ఏకంగా 300 సినిమాలకు పైగా నటుడిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈయన కేవలం విలక్షణ నటుడు మాత్రమే కాదు ప్రముఖ దర్శకుడు కూడా.  మొగుడ్స్ పెళ్ళాం అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతే కాదు పలు టీవీ సీరియల్స్లో కూడా తండ్రి పాత్రలో, తాత పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈయన కేవలం దర్శకుడు, నటుడు మాత్రమే కాదు మంచి కవి అలాగే రచయిత కూడా. ఈయన రచించిన కవితలు అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి ,రంగనాథ్ కథలు ,రంగనాథ్ నడత, అక్షర సాక్ష్యం, పదపరిమళం వంటి కవితలు పుస్తకాల రూపంలో కూడా అచ్చు అయ్యాయి.


ఇక ఈయన వ్యక్తిగత విషయానికివస్తే , నిర్మల చైతన్య కుమారి తో వివాహం జరిగింది. ఈమె ఒకసారి ప్రమాదవశాత్తు ఇంటి బాల్కనీ నుంచి కిందపడి 14 సంవత్సరాలపాటు మంచానికే పరిమితం అయింది. ఇక కట్టుకున్నవాడే కన్న బిడ్డ లాగా అన్ని సపర్యలు చేశాడు. కానీ ఏ రోజు కూడా గొప్పలు చెప్పుకోలేదు. నేను నా భార్య ఇద్దరం కాదు l..నాలో సగభాగం ఆమె. ఆమెకు నేను చేసే సపర్యలు సేవ ఎలా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆమె 2009లో మరణిస్తే, ఆమె ఫోటోని దేవుడి పటాలు పక్కన చేర్చి, పూజిస్తూ ఫోటో మీద డెస్టినీ అని కూడా రాసుకున్నాడు.

అయితే ఈయన ఒక రోజు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.కానీ రైలు ఆలస్యంగా రావడంతో, తల్లి ఆశయం గుర్తుకు వచ్చి తిరిగి వచ్చాడు తర్వాత 2015లో అర్ధాంతరంగా కవాడిగూడ, హైదరాబాదులో తన నివాసంలో డిసెంబర్ 19వ తేదీన ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ మూగబోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: