క్రికెట్ (Cricket) ప్రియులకు గుడ్ న్యూస్. గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోన్న క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ పై ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది.ఇక మనల్ని అలరించేందుకు ఈ టోర్నీ ఆగస్టు నెలలో మనముందుకు రానుంది. ఐపీఎల్ (IPL) ముగిసిన రెండు నెలల తర్వాత ఈ ధనాధన్ టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. శ్రీలంక (Sri lanka) వేదికగా ఆగస్టు 27 వ తేదీ నుంచి సెప్టెంబర్ 11 వ తేదీ వరకు కూడా ఆసియా కప్ టి20 టోర్నీ జరగనుంది. ఈ మేరకు శనివారం నాడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనను విడుదల చేసింది. 1984 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం 14 పర్యాయాలు ఈ ఆసియా కప్ జరిగింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి టోర్నమెంట్ ను జరుపుతూ ఉండగా కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని ముందు భావించినా కాని అది సాధ్యపడలేదు.


తాజాగా ఈ 2022లో ఈ టోర్నమెంట్ ను స్టార్ట్ చేసేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా భారత్ (India) ఈ టోర్నీలో ఏడు సార్లు విజేతగా నిలిచి అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ ను గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఐదు సార్లు టైటిల్స్ గెలిచి రెండవ స్థానంలో ఉంది.ఇక ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 27 వ తేదీ నుంచి ఆరంభం కానుండగా... టోర్నీ క్వాలిఫయర్స్ మాత్రం ఆగస్టు 20 వ తేదీ నుంచి జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు శనివారం నాడు జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ జనరల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ మీటింగ్ కు బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా హాజరయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా అలాగే అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు లనుంచి సభ్యులు పాల్గొన్నారు. ఇక అదే సమయంలో ఏసీసీ ప్రెసిడెంట్ గా జై షా టర్మ్ ను మరో ఏడాది పాటు పొడిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: