టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనలో తలతో పాటు శరీరం అంతా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్లోని రూర్కి సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అతివేగంతో ఇక రోడ్డు పక్కన ఉన్న రీలింగ్ ను ఢీ కొట్టింది.  ఇక ఈ ఘటనలో పంత్ ప్రయాణిస్తున్న బిఎండబ్ల్యూ కారు పూర్తిగా దగ్ధమైంది అన్న విషయం తెలుస్తుంది.


 అయితే అటు ఈ ఘటన జరిగిన సమయంలో రిషబ్ పంత్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఇక కారు నుంచి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయినప్పటికీ ఇక అతివేగంగా కారు నడిపిన నేపథ్యంలో తీవ్ర గాయాల పాలయ్యాడు అని చెప్పాలి. అయితే డివైడర్ను ఢీ కొట్టిన కారు దాదాపు 200 మీటర్ల వరకు దూసుకు వెళ్లడంతో కారు మంటల్లో కాలిపోయింది. ఇక ప్రస్తుతం రిషబ్ పంత్  ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ తమ ప్రకటనలో తెలిపింది. గాయాల తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ పంత్ కోరుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.

 ఇకపోతే  డ్రైవింగ్ విషయంలో రిషబ్ పంత్  ను దాదాపు మూడేళ్ల క్రితమే శిఖర్ ధావన్ హెచ్చరించిన ఒక వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఐపీఎల్ 2019 సమయం లో పంత్,  ధావన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా. భయ్యా ఒక సీనియర్గా నువ్వు నాకు ఏం అడ్వైజ్ ఇస్తావు అంటూ పంత్ అడిగాడు. దీనికి బదులు ఇచ్చిన ధావన్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించు అంటూ సలహా ఇచ్చాడు. ఇక ఇప్పుడు రిషబ్ పంత్  ప్రమాదానికి గురైన నేపథ్యంలో ధావన్ సలహా పాటించి ఉంటే బాగుండేది అని ఎంతోమంది ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: