మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన సినిమాలను వరుస పెట్టి ఈ మధ్య కాలంలో రీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి ఇంద్ర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలలో హీరోయిన్లుగా నటించగా ... బి గోపాల్మూవీ కి దర్శకత్వం వహించాడు. అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ఆ సమయంలో అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి  టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.

చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని కూడా కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా కూడా భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా ఇప్పటివరకు చిరంజీవి నటించిన ఇంద్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి కొదమ సింహం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. 

మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను ఈ సంవత్సరం నవంబర్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా కూడా ఇంద్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరి రీ రిలీజ్ లో భాగంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: