దగ్గుబాటి పురందేశ్వరి అనగానే ఎన్టీఆర్ కుమార్తె అని అందరికీ ముందుగా గుర్తుకు వస్తుంది. అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ రూ.100 నాణేన్ని విడుదుల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కూతుళ్లు, మనమళ్లు, మనమరాళ్లు, అల్లుడ్లు అందరూ పాల్గొన్నారు. ఇందులో చంద్రబాబు, పురందేశ్వరీ ఇద్దరు కూడా పాల్గొన్నారు.


అయితే దానికి సంబంధించి పురందేశ్వరీ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలను ఆనాడు అరికట్టడానికే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టాడని అన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తాను అనుకున్నది సాధించాడని చెప్పారు.  అయితే ఆమె అన్న మాట వాస్తవమే. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది. కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు సేవ చేయడానికే అని తెలిసిందే.


కానీ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరి కేంద్రమంత్రిగా పదవులు అనుభవించిన పురందేశ్వరికీ ఆనాడు ఈ విషయం గుర్తుకు రాకపోవడం అనేది చాలా విచారకరం కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. పదవులు కావాలంటే మాత్రం కాంగ్రెస్ లోకి వస్తారు. టీడీపీలో చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కనికరం లేకుండా చూసిన నాడు కాంగ్రెస్ గుర్తుకువచ్చింది. అధికారం, పదవులు అన్ని అనుభవించాక ఇప్పుడు అదే కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నారని మండి పడుతున్నారు.


టీడీపీని తండ్రి నుంచి లాక్కున్న చంద్రబాబును విమర్శించాల్సింది పోయి పురందేశ్వరికీ రాజకీయంగా జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ ను ఇప్పుడు విమర్శించడం తగదని అన్నారు. పురందేశ్వరీ మాట్లాడుతూ.. అప్పట్లో వాజ్ పేయీ కూడా ఎన్టీఆర్ ను మెచ్చుకున్నారని అనడం కాంగ్రెస్ కు పోటీగా పార్టీ పెట్టడాన్ని అభినందించారని చెప్పడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పు పడుతున్నారు. మొత్తం మీద బీజేపీ అధ్యక్షురాలు, టీడీపీ అధినేత ఒకే వేదికపై కలవడం ఈ రకంగా  సాధ్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: